తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు కలిచివేశాయి: కొండా సురేఖ - వైకాపా ఎమ్మెల్యేలపై కొండా సురేఖ

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైకాపా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొండా సురేఖ(konda surekha on ycp mlas) ఖండించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలిచి వేశాయని అన్నారు. ఇలాంటి వాటిని దేశ ప్రజలంతా వ్యతిరేకించాలని సూచించారు.

Konda surekha on chandrababu issue
మాజీమంత్రి కొండా సురేఖ

By

Published : Nov 22, 2021, 7:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తనకు బాధ కలిగించిందని మాజీమంత్రి కొండా సురేఖ(konda surekha on chandrababu) తెలిపారు. నారా భువనేశ్వరిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలిచి వేశాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా(ap assembly issue) వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు.

ఆమె మీద ఉన్న గౌరవం పోయింది

లక్ష్మీ పార్వతి ఆ ఇంటి కోడలుగా ఉండి కూడా వారిని విడదీసేటట్లుగా మాట్లాడారని కొండా సురేఖ(konda surekha responded on cbn) ఆరోపించారు. లక్ష్మీ పార్వతి మాటలతో ఆమె మీద తనకున్న గౌరవం కూడా పోయిందని విమర్శించారు. ఎమ్మెల్యే రోజా తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడ్డారని ఆమె గుర్తు చేశారు. కానీ ఒక సాటి మహిళగా గౌరవించాల్సింది పోయి బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరు ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్‌ షర్మిల కూడా ఈ ఘటనపై స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేటీఆర్ స్పందించకపోవడం దారుణం

రాజకీయాలు పార్టీల వరకే ఉండాలి కానీ.. వ్యక్తిగతంగా కుటుంబాల వరకు వెళ్లొద్దని కొండా సురేఖ(ex ministre konda surekha) సూచించారు. సీఎం కేసీఆర్ కూతురు కవిత ఏపీ ఘటనపై కవిత స్పందించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తల్లి లాంటి మహిళకు అవమానం జరిగితే కేటీఆర్ కనీసం ట్విట్టర్‌లో అయినా స్పందించకపోవడం దారుణమని కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ప్రముఖులు ఫోన్

అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తమిళస్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సైతం చంద్రబాబును ఫోన్​లో పరామర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా వైకాపా ఎమ్మెల్యే తీరును తప్పబట్టారు. చంద్రబాబు సీఎం అయితే నీ పరిస్థితి ఏంటని జగన్​ను ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

Rajinikanth Phone call to Chandrababu : చంద్రబాబుకు నటుడు రజనీకాంత్​ ఫోన్​

'చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయా...వ్యక్తిగత దూషణలు సరికాదు'

తెలుగుజాతికి జరిగిన అవమానం ఇది.. ప్రతి ఒక్కరూ స్పందించాలి: ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details