కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని... రాష్ట్ర ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఎన్నో పోరాటాల ఫలితంగా అగ్రకులాల విద్యార్థులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతి అన్నారు.
'వచ్చే ఏడైనా రిజర్వేషన్లు అమలు చేయాలి' - తెలంగాణ రాష్ట్ర ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంక్షేమ సంఘం
పేద అగ్రకులాల విద్యార్థులకు పది శాతం ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతి అన్నారు.
ఇందుకు కృతజ్ఞతగా ఏప్రిల్ చివర వారంలో అన్ని రాష్ట్రాల అగ్రకుల సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల బృందం ప్రధాని మోదీని కలిసి సత్కరించనున్నట్లు తెలిపారు. వీకర్ సెక్షన్ల రిజర్వేషన్లను తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ అమలు చేయలేదని ఆరోపించారు. రాబోయే విద్యా సంవత్సరంలోనైనా తప్పనిసరిగా అమలు చేసి... అగ్రకులాల నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం