బడ్జెట్‌కు రంగం సిద్ధం - DOUBLE BED ROOMS
రాష్ట్ర బడ్జెట్ ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయలు దాటనుందని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరం మెుదటి నాలుగు నెలల బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించనుంది.
రాష్ట్ర ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్థికశాఖ సిద్ధమైంది
బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటనుందని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరం మెుదటి నాలుగు నెలల బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించనుంది. సాగునీటి రంగం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ఈసారి బడ్జెట్లో అత్యధిక నిధులు దక్కనున్నాయి. సాగునీటి రంగానికి కనీస మెుత్తంగా రూ.25 వేల కోట్లను ప్రతిపాదించనున్నారు.
రైతుబంధు పథకం పెట్టుబడి రాయితీ ఎకరాకు ఐదువేల రూపాయలు పెరిగిన నేపథ్యంలో ఈసారి రూ.14 వేల కోట్లకు పైగా కేటాయించనున్నారు. లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, ఆసరా పింఛన్ల మెుత్తం ఈసారి 10వేల కోట్ల రూపాయలు దాటనుంది. గత బడ్జెట్లో ఆసరా పింఛన్లకు రూ.5,300 కోట్లను కేటాయించింది. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంతో పాటు గృహ నిర్మాణానికి నిధులు పెరగనున్నాయి. గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యంగా నిధులను పెంచనున్నారు.