పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగా ఓటు నమోదు కార్యక్రమం చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ సనత్ నగర్‌లోని కంచర్ల లక్ష్మినారాయణ యాదవ్ పార్క్‌లో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
కార్పొరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పార్కులో కొత్తగా నిర్మించిన యోగా షెడ్డు నిర్మాణ పనులను, నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ను ప్రారంభించారు.