వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధుల కట్టడికి చేపట్టిన డ్రై డే విజయవంతంగా కొనసాగుతోంది. దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట గణేశ్ నగర్లో పర్యటించిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు.. కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పంచారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని తన స్వగృహంలో రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిసరాలు పరిశుభ్రం చేసి, మొక్కలకు నీళ్లు పట్టారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని తన ఇంటి పెరట్లో చెత్తను తొలగించి... కుండీల్లోని నీటినిల్వను తొలగించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పూల కుండీలను శుభ్రం చేశారు. ఇంటి అవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలిగించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా వరంగల్అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లిలో.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాలోకి వెళ్లి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు.