తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలక్ట్రానిక్​ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్​ స్టేషన్స్​ - ఈ-వాహనాల ఛార్జింగ్​

ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్ కోసం రాజస్థాన్ సంస్థ (ఆర్​ఈఐఎల్)​, రాష్ట్రానికి చెందిన టీఎస్​ రెడ్‌కో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలి విడతలో 200 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ను... రెండో విడతలో 270 ఈవీ స్టేషన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఎలక్ట్రానిక్​ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్​ స్టేషన్స్​
ఎలక్ట్రానిక్​ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్​ స్టేషన్స్​

By

Published : Jan 12, 2020, 7:12 AM IST

ఎలక్ట్రానిక్​ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్​ స్టేషన్స్​

రాష్ట్రంలో ఈ-వాహనాల ఛార్జింగ్​ను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల అమలుకోసం రాజస్థాన్ సంస్థ (ఆర్.ఈ.ఐ.ఎల్), తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీ. ఎస్.రెడ్కో) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. భారత ప్రభుత్వం భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ పథకం కింద ఆర్ఈఐఎల్ ఎండీ ఏ.కే. జైన్, జీ. ఎం.ఆర్.కే. గుప్తా, టీ.ఎస్.రెడ్కో జీఎం జీఎస్వీ ప్రసాద్ సమక్షంలో ఒప్పందం జరిగింది.

మొదటి విడతలో 200 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్​ను... రెండో విడతలో 270 స్టేషన్స్​ను ఏర్పాటు చేయనున్నారు. మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, మునిసిపల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ పార్కింగ్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు.

ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!

ABOUT THE AUTHOR

...view details