ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలువీడ్కోలు రోజు అన్నీ చెబుతానన్న సీజేఐ CJI Ramana Retirement తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ వీడ్కోలు ప్రసంగంలో చెబుతానన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. మరోవైపు మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రవాస భారతీయులకూ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ప్రేయసి మరణం, యువకుడి బలవన్మరణంఫేస్బుక్లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదురించి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. యువతి తల్లిదండ్రులు విడదీయడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువతి మరణాన్ని భరించని ఆ యువకుడు.. తానులేని ఈ లోకంలో నేనుండనంటూ ప్రాణాలు విడిచాడు. చావైనా బతుకైనా తనతోనే అంటూ.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలచివేసింది.లక్ష్మణ్‌కు భాజపాలో కీలక స్థానం Bjp leader Laxman పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులోకి భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌కు అధిష్ఠానం స్థానం కల్పించింది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యం, సామాజిక సమీకరణాల కోణంలో కమలదళం ఆయన్ను వ్యూహాత్మకంగానే బోర్డులోకి తీసుకుందని పార్టీ వర్గాల సమాచారం.సత్ఫలితాలిస్తున్న తెలంగాణ డయాగ్నస్టిక్స్ పథకంTelangana Diagnostics రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ పథకం విజయవంతమైంది. దీనికింద ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, రేడియాలజీ హబ్‌ల ద్వారా జులై 31, 2022 వరకు సుమారు 30 లక్షల మంది రోగులకు లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలే లక్ష్యంగా మరిన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపింది.ఆహార భద్రత కార్డులతోనూ ఆరోగ్యశ్రీ సేవలు Arogyashree services రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ - ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డు కూడా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.ఆ భూమి రామానాయుడు కుటుంబానిదేనన్న హైకోర్టుదగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములు తమవేనంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్‌లో 1996లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములతోపాటు సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పి.గోవిందరెడ్డి తదితరులకు చెందిన 26 ఎకరాల భూమికి సంబంధించిన హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది.ఆకలితో అల్లాడుతున్న ప్రపంచం ప్రపంచంలో 100 కోట్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక వెలువరించింది. 2030 వరకు కూడా ఈ సమస్యను అధిగమించడం కష్టమే అని పేర్కొంది. భారత్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది.పేగుల్లోని బ్యాక్టీరియాతో కొత్త సమస్యలుమారుతున్న ఆహార అలవాట్లకు తగ్గట్లుగా మానవ శరీరంలోని బ్యాక్టీరియా కొత్తరూపం సంతరించుకుంటుంది. శరీరానికి మేలు చేసే వాటితో పాటు హాని కలిగించే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఆరోగ్య ఆహారం ఒక్కటే దీనికి మందు.మసీదులో భారీ పేలుడు, 20 మంది దుర్మరణం Kabul Blast సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. కాబుల్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.సౌందర్యలహరిపై మాట్లాడిన దర్శకేంద్రుడుదర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ఈనాడు సినిమాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం