శనివారం ఎస్పీ బాలు అంత్యక్రియలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో వీటిని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాలు పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
బాలు మృతిపట్ల కేటీఆర్, హరీశ్ రావు విచారం
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకుఇక్కడ క్లిక్ చేయండి.
'బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు'
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
'డార్లింగ్ ఇదేంటి అన్యాయం'
డార్లింగ్ ఇదేంటి అన్యాయం.. చాలా అన్యాయం ఇది. ఘంటశాల గారే తొందరగా వెళ్లిపోయారనుకుంటే మీరు కూడా గంధర్వులలో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. అంటూ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్.. ఎస్పీబీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంకా నటకిరిటీ ఏమన్నారంటే..?
బాలు మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
దిగ్గజ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచంలో తనదైన మార్క్ చూపించారు. దాదాపు 40 వేలకు పైగా పాటల్ని పాడి గిన్నిస్ రికార్డు సాధించారు. అలాంటి గాయకుడు తన మొదటి రెమ్యునరేషన్ గురించి ఓసారి చెప్పారు. ఎంతంటే..?