1. మంత్రి హరీశ్‌రావుకు కరోనా
మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్‌లో మంత్రి వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
2. బావ త్వరగా కోలుకుంటారు..
ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయనే స్వయంగా తెలిపారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్... హరీశ్‌రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'త్వరగా కోలుకోండి బావ.. మీరు అందరి కంటే త్వరగా కోలుకుంటారంటూ.. పోస్ట్ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
3. తహసీల్దార్ కారు అడ్డగించిన రైతు
భూ సమస్యను పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రైతుకు తహసీల్దార్ వాహనం తగలటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భూ సమస్య పరిష్కరించమని వెళితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
4.బైక్ బోట్‌ను తయారుచేసిన మెకానిక్ శంకర్
సాంకేతికంగా ఉన్నత చదువులు చదువుకోకపోయినా ఓ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేశాడు. తన వృత్తికే సృజనాత్మకత జోడించి.. మత్స్యకారుల కష్టాలు తీర్చేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. చెరువుల్లో చేపలు పట్టేందుకు ద్విచక్రవాహనంతో కూడిన చిన్నపాటి బోట్ తయారుచేసి... ప్రత్యేకత చాటుకున్నాడీ ఈ మెకానిక్.పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
5. గ్యాస్ పైప్‌లైన్ పేలి 12 మంది మృతి
బంగ్లాదేశ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడులో 12 మంది మరణించారు. నారాయణ్‌గంజ్‌లోని బైతుస్ సలాత్ జామే మసీదులో ప్రార్థనలు ముగించుకొని.. బయటకు వస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.