సీని సమీక్ష
సినిమా, టీవీ రంగాల పునరుద్ధరణపై మంత్రి తలసాని సమీక్షించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, చిత్ర, టీవీ రంగ ప్రముఖులతో మాట్లాడారు. సమావేశంలో ఏం చర్చించారంటే..?
హైదరాబాద్‌కు ఆల్‌ఖైదా!
ఆల్‌ఖైదాకు ఆర్థికంగా సాయం చేశాడనే అభియోగంపై అమెరికాలో ఐదేళ్లు జైలు శిక్షను అనుభవించిన జుబేర్ అహ్మద్ హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఏపీలో కొత్తగా 68 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,787కు చేరింది. ఏపీలో కరోనా కేసుల పూర్తి వివరాలు ఇలా...
ఇంటికే మద్యం!
మద్యం ప్రియులకు కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు జరిగేలా సరికొత్త ఒక యాప్‌ను తీసుకొచ్చింది. అది ఏంటంటే..?
దారుణం
నల్గొండ జిల్లా నర్సింగ్‌భట్లలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన కన్నకొడుకే ఆ తల్లికి కాలయముడయ్యాడు. వృద్ధురాలైన తల్లిని సాకలేక.. కిరోసిన్ పోసి కాల్చి చంపాడు. పూర్తి వివరాలు ఇలా..
'ఫ్లయింగ్ బుల్లెట్లు'
18వ స్క్వాడ్రన్ ఫ్లయింగ్ బుల్లెట్స్ సేవలను నేటి నుంచి వినియోగించనుంది భారత వైమానిక దళం. ఈ ఫ్లయింగ్ బుల్లెట్ల సేవలను ఎక్కడ ప్రారంభించారంటే..?
ప్రతిష్ఠాత్మక పురస్కారం
ఐక్యరాజ్య సమితి అందించే.. ప్రతిష్ఠాత్మక డ్యాగ్ హామ్మర్స్జోల్డ్ మెడల్ ఐదుగురు భారతీయులను వరించింది. వారు ఎవరంటే...?
సిగ్నల్స్ వేగంగా రావాలంటే..
మహమ్మారి కరోనా వల్ల పలు సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇంటి వద్ద ఉండే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రాథమికంగా కావాల్సింది ఇంటర్నెట్ సిగ్నల్. సిగ్నల్స్ వేగంగా రావాలంటే ఏం చేయాలంటే..?
'కోహ్లీ, నేను స్నేహితుల్లా ఉండేవాళ్లం'
ప్రస్తుతం తాను ఆడుతూ ఉండుంటే కోహ్లీతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకునే వాడినని చెప్పాడు పాక్ మాజీ బౌలర్. అతను ఎవరంటే..?
టీ20 ప్రపంచకప్ వాయిదా!
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేయనున్నారు. మే 28న జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం...
బుట్టబొమ్మకు అంతర్జాతీయ రికార్డు
100 గ్లోబల్ వీడియోల్లో 'అల వైకుంఠపురములో' సినిమాకు చెందిన 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలు చోటు దక్కించుకుని రికార్డు సృష్టించాయి. పూర్తి వివరాలు కోసం...