తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2020, 9:01 AM IST

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-9AM
టాప్​టెన్​ న్యూస్​@9AM

ఆ 19మంది ఎవరు?

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ 19 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలవారీగాఅధికార, ప్రతిపక్షాల బలాబలాలను పరిశీలిస్తే... ఇలా ఉన్నాయి.

కమ్ముకొస్తున్న ముప్పు

కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజురోజుకీ విజృంభిస్తోంది.. గురువారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300, మొత్తం కేసులు ఆరు వేలు దాటాయి.రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఇలా ఉంది.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయా?

కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ఈసారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. సాధారణంగా ఫలితాలు ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్‌బోర్డు మాత్రం కాలపట్టికను ప్రకటించలేదు. బోర్డు తీసుకునే నిర్ణయాలు ఏమిటంటే..

జగిత్యాల స్ఫూర్తితో జలహితం

జగిత్యాల జిల్లాలో వినూత్నంగా అమలు చేసిన జలహితం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఉపాధి హామీ పథకం కింద కాల్వల్లో పూడిక తీయనున్నారు. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

కలిసి కొడదాం

సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు ప్రధాని. ఆయా పార్టీల నేతల అభిప్రాయాలను తెలుసుకుని.. సరిహద్దు వివాదంలో విధాన నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఏఏ అంశాలను చర్చించవచ్చంటే..

డ్రాగన్​ కుట్ర

గల్వాన్​ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటానికి చైనా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ బుల్డోజర్లను మోహరించింది. ఉపగ్రహ చిత్రాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఏ కష్టమొచ్చిందో..

మహారాష్ట్రలో విషాదం నెలకొంది. పుణెలోని సుఖ్‌సాగర్‌ పరిసరాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో సహా ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఇలా చెబుతున్నారు.

అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్​ దాడులు

ఇరాక్​లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా 4 రాకెట్లతో దాడులు జరిగాయి. ఇరాక్​తో అమెరికా చర్చలు జరుపుతున్న క్రమంలో దాడులు జరగటం ఇది మూడోసారి. ఈ దాడులపై ఎవరెలా స్పందించారంటే..

ఆరోజు గుర్తుందా..

భారత క్రికెట్​ చరిత్రలో మరుపురాని ఘట్టాల్లో 1983 ప్రపంచకప్​ ఒకటి. జింబాబ్వేపై కపిల్​ దేవ్​ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇప్పటికీ క్రికెట్​ అభిమానుల కళ్లలో మెరుస్తూనే ఉంటుంది. జూన్​ 18 నాటికి ఈ ఇన్నింగ్స్​కు 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ ఇన్నింగ్స్​ ఎందుకంత ప్రత్యేకమో తెలుసా.

చందమామ పుట్టిన రోజు

ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. 36వ వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ సందర్భంగా ఆమె గురించి విశేషాలు మీకోసం.

ABOUT THE AUTHOR

...view details