1.కర్ఫ్యూకి ఆస్కారం లేదు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కొవిడ్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెరాసలో విలీనం
తెలుగుదేశం శాసనసభాపక్షం తెరాస శాసనసభాపక్షంలో విలీనమైంది. తెలుగుదేశం తరఫున ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు టీడీఎల్పీని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చర్యలు తప్పవు
ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను గౌరవించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే.. తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆరు నెలల పాటు అనాథాశ్రమంలో సేవ చేయాలని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అత్యవసరమైతేనే రండి..
దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలోనూ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే వైద్యారోగ్యశాఖపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గ్రీన్ సిగ్నల్
ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.