తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్​ 9AM - Telangana Top News

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana Top News
టాప్​న్యూస్​ 9AM

By

Published : Aug 15, 2022, 8:59 AM IST

Updated : Aug 15, 2022, 9:35 AM IST

  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Indian independence day 2022: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు ప్రధాని. రాజ్​ఘాట్​కు వెళ్లిన మోదీ.. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

  • సరికొత్త దారిలో ప్రయాణించే సమయం ఆసన్నమైందన్న మోదీ

భారత గడ్డపై ఉన్న మట్టిలో శక్తి ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం ముందుకెళ్లకుండా ఆగేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశం ఎవరికీ తలవంచదని, ముందుకు వెళ్తూనే ఉంటుందని నొక్కి చెప్పారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ.. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశం ముందు ప్రస్తుతం అనేక సువర్ణ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవ సంకల్పంతో, కొత్త దారుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • చరిత్రగతి మార్చిన ఉద్యమం, గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్య్రం

బ్రిటీషు వారిని తరిమికొట్టి స్వతంత్రం సంపాదించడానికి 200 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. అనేక మంది ప్రజలు త్యాగాలు చేశారు. గాంధీజీ నాయకత్వంలో సాగిన ఈ పోరాటం ఎన్నో ముఖ్యమైన ఘట్టాలున్నాయి. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో పోరాటం సాగిన తీరు, బలిదానాలు, సంస్కరణలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎ.వి.రాజమౌళి ప్రత్యేక కథనం

  • జ్వరానికి పోషకాహారమే మందు, ఇంకా ఏం తీసుకోవాలంటే

ప్రస్తుతం రాష్ట్రమంతా సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని డెంగీ, మలేరియా వంటివి కూడా ప్రబలుతున్నాయి. ఇక కొవిడ్‌ ఎలాగూ కొనసాగుతూనే ఉంది. పాతకాలంలో జలుబు చేస్తే బాగా తినాలని.. జ్వరం వస్తే ఉపవాసం ఉండాలని చెప్పేవారు. నిజానికి ఈ విధానం వల్ల అనారోగ్యం పెరుగుతుందే తప్ప.. తగ్గదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

  • నేడు ఇంటింటా జెండా ఎగరవేయాలన్న సీఎం కేసీఆర్‌

Independence Day Diamond Jubilee Celebrations రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇంటింటా ఎగరవేసేందుకు కోటీ 20 లక్షల జెండాలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. సోమవారం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

  • ఇక మినహాయింపులు లేకుండా కొత్త ఆదాయపు పన్ను విధానం

ఆదాయపు పన్ను చెల్లింపులకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రస్తుత విధానం కాకుండా మినహాయింపులు లేని కొత్త పన్ను విధానం లోకి అత్యధికులను ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానానికి మారేందుకు వీలుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

  • బిగ్​ బుల్​ రాకేశ్​ ఝున్​ఝున్​వాలా అంత్యక్రియలు

Rakesh Jhunjhunwala News భారత స్టాక్​ మార్కెట్​ చక్రవర్తిగా పేరుగాంచిన రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబయిలోని బాణ్​గంగా శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.

  • హమారా క్రీడా మహాన్‌, ఆటల్లో దూకుడు కొనసాగిస్తే భవిష్యత్ మనదే

దేశ క్రీడాకారులు మన సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటివరకు క్రీడల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయినా సాగించాల్సిన ప్రయాణం.. చేరాల్సిన గమ్యం ఇంకా ఎంతో దూరం ఉంది. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఆటల్లో మన దూకుడు పెరిగింది.. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్‌ మనదే!

  • మాళవిక మోహనన్​ అందాల జాతర, మానుషి హాట్​ ట్రీట్​

తమిళ హీరోయిన్​ మాళవిక మోహనన్​, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తమ కొత్త ఫొటోషూట్స్​తో హీట్​​ పెంచారు. ఇవి సోషల్​ మీడియాలో నెటిజన్లకు చెమటలు పట్టిస్తున్నాయి. వాటిని మీరూ చూసేయండి.

  • తెలుగు వెండితెరపై స్వరాజ్య గళం

కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరినీ ఒకే స్థాయిలో కదిలించే ఓ గొప్ప భావోద్వేగం దేశభక్తి. అందుకే మాతృభూమి గురించి, స్వరాజ్యం గురించి స్పృశించే ఏ చిన్న అవకాశం వచ్చినా వదలుకోదు మన సినిమా. ఎన్నెన్ని కథలుగా చెప్పినా తరగని పోరాటాలు, ప్రాణ త్యాగాలతో కూడిన గొప్ప ఉద్యమ చరిత్ర మనది. మన సినిమా దేశభక్తిని ఎలా ప్రదర్శించిందో అమృతోత్సవాల సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం.

Last Updated : Aug 15, 2022, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details