ప్ర: న్యూయార్క్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడి వాతావరణం ఏంటి?
జ: న్యూయార్క్ మహానగరం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. గత వారంతో పోలిస్తే ఈ వారం పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గింది. ముఖ్యంగా జనాల రద్దీ కారణంగానే కరోనా ఉద్ధృతి పెరిగి.. నివారించడం కష్టంగా మారింది.
ప్ర: అమెరికాలో పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం ఏమిటి?
జ: ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడమే వైరస్ ఉద్ధృతికి ప్రధాన కారణం. గత సంవత్సరం డిసెంబర్లోనే కరోనా మొదలైనప్పటికీ.. ఫిబ్రవరి వరకూ దేశంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. మార్చి నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. కరోనా తీవ్రతను ఊహించలేకపోవడం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తోంది.
ప్ర: దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, బీసీజీ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు కదా! దాని ప్రభావం ఎలా ఉంది?
జ: హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కువ కేసులు ఉన్న చోట వాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా అంతగా వాడడం లేదు. నార్త్ ఈస్ట్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీ వైపు ఎక్కువగా వాడుతున్నారు. ఫలితాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. తీవ్రత ఎక్కువైనప్పుడు రోగులు, వారి కుటంబు సభ్యుల్లో మానసిక ధైర్యం నింపడం కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఎజిత్రో మైసిన్ అనే రెండింటిని మాత్రం నార్త్‌ఈస్ట్‌లో వాడుతున్నారు. రికవరీ రేటు మాత్రం అంచనాకు తగినట్లుగా లేదు. అందువల్ల అన్ని చోట్ల దాన్ని అమలు చేయలేకపోతున్నారు.