- దాదాపు రెండున్నర నెలల తర్వాత దేయాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఆలయాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
సోమవారం నుంచి దేవాలయాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం సూచించిన మేరకు సీఎం కేసీఆర్ ఆలయాలను తెరవాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవాదాయశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. భక్తులకు తగిన భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లు ఏర్పాటు చేశాము. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో ఆలయం శుభ్ర పరచడం, ప్రవేశద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించాము. ఆలయానికి వచ్చే భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాము. ఆరోగ్యసేతు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలని కూడా భక్తులకు సూచిస్తాము. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు థర్మల్గన్స్ ఏర్పాటు చేస్తున్నాము. శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయి. అన్ని జాగ్రత్తలతోనే ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తాము.
- రాష్ట్రంలో చాలా దేవాలయాలున్నాయి. ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు?
వేములవాడ, బాసర, భద్రాచలం, యాదగిరిగుట్ట లాంటి ఆలయాలకు భక్తులు కాస్త ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆయా దేవాలయాల్లో కల్యాణాలు, బాసరలో అక్షరాభ్యాసం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తాము. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం లేదు.
- తీర్థప్రసాదాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు?