పట్టభద్రుల ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ స్థానాన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పోటాపోటీగా అభ్యర్థులను బరిలో నిలపటంతోపాటు ప్రచారంలోనూ జోరు చూపిస్తున్నాయి . తెదేపా తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల వల్లే పోటీలో నిలిచానంటున్న రమణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్రశ్నించాలనే ఈసారి మండలి బరిలో దిగా: ఎల్.రమణ
చట్టసభల్లో ప్రశ్నించాలనే ఈసారి మండలి బరిలో దిగినట్లు తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రమణ పేర్కొన్నారు. గెలిచిన వాళ్లను అధికారపక్షం పార్టీలో కలిపేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నించాలనే ఈసారి మండలి బరిలో దిగా: ఎల్.రమణ