ఈటీవీ భారత్: ఈ పుట్టగొడుగుల ఉత్పత్తి కరోనా ఎయిడ్ గురించి వివరించగలరా?
మిశ్రా: ఇది పుట్టగొడుగుల ద్వారా తీసిన పొడి. ఈ పుట్టగొడుగులను ప్రజలు చాలా ఏళ్లుగా ఆహారంగా తీసుకుంటున్నారు. గతంలో అందుబాటులో ఉన్న పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ పుట్టగొడుగుల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయని తెలుసు. మా పరిశోధనల్లో ఇది కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించాం. మానవ శరీరంలోనూ ఇది వైరస్ పెరుగుదలను నియంత్రించగలదని ఆశిస్తున్నాం. ఏళ్లుగా ఈ పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటున్నారు కాబట్టి దుష్ఫలితాలు ఎక్కువగా ఉండవు. ఎక్కువ ట్రయల్స్ కూడా అవసరం ఉండదు. వీటన్నింటి దృష్ట్యా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ సైతం దీనిని అమ్మేందుకు అనుమతి ఇచ్చింది.
ఈటీవీ భారత్: హిమాలయాల్లో పెరిగే ఈ పుట్టగొడుగులను ఇక్కడ ఎలా పెంచుతారు?
మిశ్రా: ఈ పుట్టగొడుగులు హిమాలయాల్లోని కొంతకాలం మాత్రమే పెరుగుతాయి. ఆ తర్వాత అత్యంత చలిలో పెరగలేవు. ఇవి పెరిగే ప్రత్యేక పరిస్థితులను ప్రయోగశాలలో కల్పించాం.
ఈటీవీ భారత్: దేశంలో ఇప్పటికే 30 శాతం మందికి కరోనా సోకిందని... త్వరలోనే అది 50 శాతానికి పెరగవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా?
మిశ్రా: 30 శాతం మందికి వైరస్ సోకిందని చెప్పేందుకు సరిపడా ఆధారాలు మన దగ్గర లేవు. వేలమంది నుంచి సేకరించిన వివరాలను కోట్లమందికి ఆపాదించలేం.
ఈటీవీ భారత్: ఫిబ్రవరిలోగా కరోనా నుంచి బయటపడతామని నిపుణుల కమిటీలు చెబుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం?