తెలంగాణ

telangana

ETV Bharat / state

Sub committee for houses: ఇళ్లస్థలాల సమస్యల పరిష్కారం కోసం సబ్​కమిటీ ఏర్పాటు - House sites committee

తెలంగాణలో ఇళ్ల స్థలాల సమస్యలు, వివిధ అంశాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని (Sub committee for houses) నియమించింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటైంది.

Sub committee for houses
సబ్​కమిటీ ఏర్పాటు

By

Published : Sep 21, 2021, 5:28 PM IST

రాష్ట్రంలో ఇళ్లస్థలాలకు సంబంధించిన వివిధ అంశాల పరిశీలన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని (Sub committee for houses) ఏర్పాటు చేసింది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ (Minister Ktr) అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్లు-ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామకంఠం సహా ఇండ్లస్థలాలకు సంబంధించిన ఇతర అంశాలను ఉపసంఘం పరిశీలించి ప్రభుత్వానికి తగు సిఫారసులు అందించనుంది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్ కమిటీకి కన్వీనర్​గా వ్యవహరిస్తారు.

ఇదీ చూడండి: CM KCR: అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే పరమావధి

ధరణి సబ్ కమిటీ...

ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకోసం... హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో మరో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లు, సంబంధిత అంశాలు, సమస్యలపై మహమూద్ అలీ నేతృత్వంలో హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటైంది. పోడు భూములపై కూడా మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన కూడా మరో ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:YS Sharmila Hunger Strike : 'ఇదేందక్కా ఇది.. దీక్షకు తీసుకొచ్చి పైసలు లేవంటారా?

ABOUT THE AUTHOR

...view details