ఈఎస్ఐ మందుల కుంభకోణంలో దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహారం బయటకు వచ్చింది. ఏసీబీ అదుపులోకి తీసుకున్న తేజ ఫార్మా కంపెనీ నిర్వాహకుడు రాజేశ్వర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస రెడ్డి పేరిట రెండు షెల్ కంపెనీలు ఉన్నట్లు అనిశా ఇప్పటికే గుర్తించింది. ఈ రెండు కంపెనీల పేరిట డైరెక్టర్ దేవికా రాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి కోట్ల సొమ్మును గోల్మాల్ చేసినట్లు గుర్తించారు.
డొల్ల కంపెనీలతో రూ.3 కోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు - దేవికా రాణి
ఈఎస్ఐ మందుల కుంభకోణంలోని మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజ ఫార్మా కంపెనీ ఎండీ రాజేశ్వర్ రెడ్డి సోదరుడి పేరుతో ఉన్న రెండు డొల్ల కంపెనీల పేరుతో దేవికారాణి, పార్మాసిస్ట్ నాగలక్ష్మీ కోట్ల సొమ్మును గోల్మాల్ చేసినట్లు గుర్తించారు.
డొల్ల కంపెనీలతో 3 కోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు
ఆ డబ్బుతో దేవికా రాణి 3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా ఏసీబీ విచారణలో తేలింది. ఈ డొల్ల కంపెనీలకు సంబంధించి హైదరాబాద్ అల్వాల్‌లోని శ్రీనివాస రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించి.. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస రెడ్డిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తా: పవన్