ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. ఉపయోగం లేదని వాపోయారు.
'5 నెలల జీతాన్ని చెల్లించాలని ఈఎస్ఐ ఉద్యోగుల ఆందోళన' - esi employees protest in Hyderabad
ఈఎస్ఐలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడమే గాక.. విధులు నిర్వహిస్తున్న వారికి ఐదు నెలల నుంచి వేతనం చెల్లించడం లేదని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. ఐదు నెలల జీతాన్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఈఎస్ఐ డైరెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
హైదరాబాద్‌లో ఈఎస్ఐ ఉద్యోగుల ఆందోళన
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నా.. తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఈఎస్ఐ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఈఎస్ఐ డైరెక్టరేట్ వద్ద తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్, వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
- ఇదీ చూడండి: 'ఈఎస్ఐ కుంభకోణంలో ఏపీ మంత్రి పాత్ర... బర్త్‌రఫ్ చేసి విచారించండి'