తెలంగాణ

telangana

ETV Bharat / state

"నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీర వనిత" - ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివనివి

ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివని తన కుమార్తె, మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. ఈశ్వరీబాయి వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ మారేడ్​పల్లిలోని ఈశ్వరీబాయి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ధీర వనిత ఈశ్వరీ బాయి అని కొనియాడారు.

"Brave woman who fought for the doctrine of believers"
"నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీర వనిత"

By

Published : Feb 24, 2020, 5:08 PM IST

ఈశ్వరీ బాయి వర్ధంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ మారేడ్ పల్లి ఎస్డీ రోడ్డులోని ఈశ్వరీ బాయి విగ్రహానికి మాజీమంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పూల మాలవేసి నివాళులు అర్పించారు. టీచర్ ఉద్యోగం చేస్తూ తన సోదరుని సహకారంతో రాజకీయాల్లోకి ప్రవేశించారని గీతారెడ్డి తెలిపారు.

కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మహానీయురాలని కొనియాడారు. అధికార పక్షం ఆహ్వానించి మంత్రి పదవులు ఇస్తామన్న.. వెళ్లకుండా ప్రజల పక్షానే పోరాడిన ధీరవనిత అని పేర్కొన్నారు. ఈశ్వరీబాయి ఆశయ సాధన కోసం ఆమె అడుగు జాడలోనే నడుస్తూ ముందుకు సాగుతానని వెల్లడించారు.

"నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీర వనిత"

ఇవీ చూడండి:నకిలీ విత్తనాలతో నరకప్రాయంగా మారిన రైతుల బతుకులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details