ట్రాఫిక్ రూల్స్ (traffic rules) ఎవరికైనా ఒకటే. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు తప్పవు. అది అధికారుల వాహనమైనా.. ప్రజాప్రతినిధుల వాహనమైనా... సామాన్యుల వాహనమైనా చలాన్ (Challan) కట్టాల్సిందే. ఇలాగే అధిక వేగంతో వెళ్తూ స్పీడ్‌గన్‌కు చిక్కి ఈ-చలాన్ (Challan)లు కట్టాల్సి వస్తుందని ఓ వ్యక్తి వాహనానికి ఎమ్మెల్యే అనే పోస్టర్ అంటించాడు.
తార్నాక స్ట్రీట్ నంబర్ 1లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం వద్ద టీఎస్ 10 EQ 6999 నంబర్ వాహనం రోడ్డుపై అడ్డంగా ఆపేశారు. తీరా చూస్తే ఆ వాహనంపై ఎమ్మెల్యే అనే పోస్టర్ కనపడుతోంది. వాహనంలోని వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిపోయాడు. స్పందించిన సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ ఫొటో తీశాడు. ట్విటర్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను, అదనపు కమిషనర్ ట్రాఫిక్‌ను ట్యాగ్ చేస్తూ విషయాన్ని పోస్టు చేశాడు.