గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంగా రేపు జరగబోయే సదస్సు పంచాయతీరాజ్ వ్యవస్థలో చిరస్థాయిగా నిలిచి పోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల 6 నుంచి అమలు కానున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొంటారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో జరగనున్న సమావేశ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఎర్రబెల్లి పరిశీలించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది :ఎర్రబెల్లి - హైదరాబాద్
హైదరాబాద్లో రేపు జరగనున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణ సదస్సు ఏర్పాట్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్ఠతకు 30రోజుల పాటు జరిగే కార్యక్రమంపై సీఎం ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సమావేశం జరగనుంది.
పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది :ఎర్రబెల్లి