జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంలో తెలంగాణ ఆగ్రస్థానంలో ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao about funds) స్పష్టం చేశారు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను అభివృద్ధి చేసినట్లు శాసనసభలో(errabelli dayakar rao speech in assembly) వివరించారు. ఈ వినియోగంపై మూడు కమిటీలు విచారణ జరిపాయని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ను ప్రధాని మోదీ(pm modi phone to cm kcr) అభినందించారని తెలిపారు. ఏ దేశంలోగానీ, గత ప్రభుత్వాల్లోనూ గ్రామాలు ఇంత గొప్పగా అభివృద్ధి జరగలేదని... భాజపా, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లోనూ ఇంత అభివృద్ధి చెందలేదని అభిప్రాయపడ్డారు.
గ్రామాల్లో ప్రగతి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికతోనే ఇవాళ గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి స్పష్టం చేశారు. నిధుల వాటా ఎంత అని కాకుండా... ఇవి ఏ రూపంలో వాడుతున్నామో ఆలోచించాలని కోరారు. ప్రతిగ్రామంలోనూ వైకుంఠధామాలను ఏర్పాటు చేసి... తొంభైశాతం వినియోగంలోకి తీసుకొచ్చామని అన్నారు. ఒకప్పుడు చెట్ల కోసం ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు పల్లెల్లోనే నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్న గ్రామానికి కూడా ట్రాక్టర్లు ఇచ్చామని గుర్తుచేశారు. చాలాతెలివిగా వీటిని ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. వందమంది జనాభా ఉన్న గ్రామాల్లోనూ ట్రాక్టర్ను ఉపయోగించుకొని... డబ్బులు కూడా కూడబెట్టుకున్నారని వివరించారు.
ఏ రాష్ట్రంలో గానీ... ఏ దేశంలో గానీ... గత ప్రభుత్వాల్లోగానీ ఎక్కడా కూడా గ్రామాల్లో ఇంత అభివృద్ధి జరగడం లేదు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ... ఆయన ప్రణాళికతో మాకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వ నిధులా? కేంద్ర ప్రభుత్వ నిధులా? అనేది ముఖ్యం కాదు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధులు మన వాటా. ఆ లెక్కలు కాదు. దీన్ని ఏ రూపంలో మనం వాడుకుంటున్నామో అవగాహన చేసుకోవాలి. వైకుంఠధామాలు చాలా బాగా చేసి... 90 శాతం వాడకంలోకి తీసుకొచ్చాం. మూడు కమిటీలు వచ్చి ఇంక్వైరీ చేశాయి. వాళ్లు పరేశాన్ అయ్యారు. సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. కరోనాతో పట్టణాల్లోని చాలామంది పల్లెలకు పోయారు. వాళ్లందరికీ పని కల్పించాం. కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ సపోర్టుకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. వేరే రాష్ట్రాలు ఇస్తలేవు. అదనంగా రూ.500 కోట్లు ఇచ్చాం. దీనిమీద మీరు ప్రిపేర్ అయి రండి. లెక్కలతో సహా క్లియర్గా చెప్తాం.