తెలంగాణ ముద్దు బిడ్డ బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి రావడం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్‌కు కేటాయించిన నిధుల వినియోగంపై చర్చించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను చేపట్టిన కార్యక్రమాలను కూడా దత్తాత్రేయకు వివరించినట్లు ఎర్రబెల్లి వివరించారు.
దత్తాత్రేయను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. దత్తన్న గవర్నర్ కావడం తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు.
దత్తాత్రేయతో ఎర్రబెల్లి