తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఎఫ్​ ఉపసంహరణకు ఎంత మంది దరఖాస్తు చేశారంటే..?

కరోనా కారణం చూపి 57,445 మంది పీఎఫ్​ ఉపసంహరణకు దరఖాస్తు చేశారని ఆ సంస్థ కమిషనర్​ వీకే శర్మ తెలిపారు. మూడు రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు జమచేస్తున్నామన్న ఆయన.. ఐటీ ఉద్యోగులే అధికంగా దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

EPF COMISSIONER
పీఎఫ్​ ఉపసంహరణకు ఎంత మంది దరఖాస్తు చేశారంటే..?

By

Published : May 1, 2020, 4:22 PM IST

కరోనాతో పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని.. హైదరాబాద్ రీజినల్ పీఎఫ్ కమిషనర్ వీకే శర్మ తెలిపారు. ఎక్కువగా ఐటీ ఉద్యోగులే దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేల 647 మంది, హైదరాబాద్​లో 57 వేల 445 మంది ఉద్యోగులు కరోనా కారణంతో పీఎఫ్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

కరోనా కారణంతో దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఇప్పటి వరకు రూ.258 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల్లో ఉపసంహరణ దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

గతంలో ఈ సమయం 20 రోజుల పట్టేదన్నారు. కరోనాతో కార్యాలయాల్లో విపరీతమైన ఉద్యోగ లేమి ఉందని.. విడతల వారీగా 30 శాతం మంది సిబ్బందితో పని చేస్తున్నామని పేర్కొన్నారు. పీఎంజీకేవై కింద రాష్ట్రంలోని 11 వేల కంపెనీలు వస్తాయన్నారు. 15 వేల లోపు వేతనం.. 100 మంది లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీల ఉద్యోగుల తరఫున వాటా కేంద్రమే భరిస్తోందన్నారు. దీని కింద ఇప్పటి వరకు 4 వేల 805 కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. మిగతా కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇవీచూడండి:భవిష్యత్​ కోసం బిస్కెట్లు దాచుకుంటున్న శునకం!

ABOUT THE AUTHOR

...view details