తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణ రక్షణే మన లక్ష్యం: రజత్​ - KUMAR

కాలుష్య భూతాన్ని నివారించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా రోజురోజుకీ దాని తీవ్రత పెరుగుతూనే ఉంది. నీటిని కాపాడుకోవటంతో పాటు వ్యర్థాలను ఎలా వినియోగించుకోవలనే అంశంపై రాజధానిలో చర్చ జరిగింది.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

By

Published : Feb 19, 2019, 8:54 PM IST

పర్యావరణాన్ని పరిరక్షించాలి
విశ్వనగరానికి పర్యావరణ పరిరక్షణ పెను సవాళుగా మారిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. నీరు, వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్ హెచ్ఐసీసీలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును రజత్​కుమార్​ ప్రారంభించారు.

అధికారులకు అభినందనలు

గతంలో అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు చికాగో వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని రజత్ కుమార్ గుర్తు చేశారు. పర్యావరణహిత కోసం పాటు పడుతున్న అధికారులను రజత్​ అభినందించారు.

సమావేశాలు ఫలవంతంగా ఉండాలి

వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, కలుషిత, వరద నీటి నిర్వహణపై విదేశీ ప్రతినిధులు పవర్​పాయింట్​ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వేదిక ద్వారా కాలుష్య నియంత్రణకు చక్కని పరిష్కారాలు లభిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి:అతివలకు అవకాశం ఎప్పుడు?

ABOUT THE AUTHOR

...view details