నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత - ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
14:35 September 16
నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత
దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత స్పష్టం చేశారు. దిల్లీలో కూర్చుని కొందరు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీడియా తమ సమయాన్ని నిజాలను చూపించేందుకు ఉపయోగించాలని కోరారు.
దిల్లీలో కూర్చొని కొందరు కావాలనే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించాలని నేను అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నా.-ట్విటర్లో ఎమ్మెల్సీ కవిత
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ సోదాలు