తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​ బెట్టింగ్​ మోసాలపై దృష్టి సారించిన ఈడీ - ఆన్​లైన్ గేమ్స్ ద్వారా మోసాలు

భారతదేశంలోని యువతను లక్ష్యంగా చేసుకుని ఆన్​లైన్​ బెట్టింగ్​ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఈడీ దృష్టి సారించింది. చైనాకు చెందిన కంపెనీలు ఆన్​లైన్ గేమ్స్ ద్వారా మోసాలు చేస్తున్నట్లు సీసీఎస్​ పోలీసులు గుర్తించి ఈడీకి, ఆదాయ పన్నుకు లేఖ రాశారు. రూ .1100 కోట్ల వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

enforcement directorate case on online bettings
ఆన్​లైన్​ బెట్టింగ్​ మోసాలపై దృష్టి సారించిన ఈడీ

By

Published : Aug 17, 2020, 11:04 PM IST

ఆన్​లైన్​ బెట్టింగ్ ద్వారా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఈడీ దృష్టి సారించింది. చైనా వ్యక్తితో పాటు మరో ముగ్గురిపై మనీ లాండరింగ్ కింద ఎన్​ఫోర్సమెంట్​ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. చైనాకు చెందిన కంపెనీలు ఢిల్లీలో ఈ కామర్స్​ పేరుతో రెండేళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించి ఆన్​లైన్​ గేమ్స్​ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. 7 నెలల వ్యవధిలో 1100 కోట్ల రూపాయలను పలు బ్యాంక్​ ఖాతాల నుంచి చైనా కంపెనీలకు దారి మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.

దీంతో సీసీఎస్ పోలీసులు ఈడీకి, ఆదాయపన్ను అధికారులకు లేఖ రాశారు. ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో సీసీఎస్ పోలీసులు చైనా వ్యాపారి యాహూవో, దిల్లీకి చెందిన వ్యక్తులు అంకిత్, ధీరజ్, నీరజ్​లను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి: రూ.81 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details