శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్లో రెండుగా చూపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఎస్సెల్బీసీ అంశాన్ని ప్రస్తావించారు. గెజిట్ నోటిఫికేషన్లో రెండు కాంపోనెంట్లుగా చూపారన్న ఆయన... 10 టీఎంసీల పనులను అదనంగా చూడరాదని అన్నారు. ఎస్సెల్బీసీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వం ఆయకట్టును మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పెంచిందని... అయితే నీటి కేటాయింపులు మాత్రం పెంచలేదని లేఖలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయకట్టుకు అనుగుణంగా నీటి కేటాయింపులను ప్రభుత్వం 30 నుంచి 40 టీఎంసీలకు పెంచిందని వివరించారు. దీంతో పది టీఎంసీలకు సంబంధించిన పనులు అదనపు కాంపోనెంట్ కిందకు రావని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను రెండుగా చూపటంపై తెలంగాణ అభ్యంతరం - telangana enc muralidhar
18:16 December 23
కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ
75 శాతం నీటి లభ్యత కింద ప్రాజెక్టుకు కేటాయింపుల అంశాన్నికూడా కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ముందు ఉంచినట్లు తెలిపారు. బేసిన్‌లోని అవసరాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి ట్రైబ్యునల్ కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు. గెజిట్ నోటిఫికేషన్ లోని ఒకటి, రెండు షెడ్యూళ్లలో ఉన్న ఎస్సెల్బీసీ రెండో కాంపోనెంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు కూడా లేఖ ప్రతిని పంపారు.
ఇదీ చదవండి:
కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాలు