కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారంటే.. ఏ కొద్దిపాటి అనుభవం ఉన్నవారైనా మీ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్టే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్కూలు, కళాశాల స్థాయిలో ఎంత మంచి ర్యాంకులు, మార్కులు సాధించినా.. పని విషయంలో కొత్తగా నేర్చుకునేవే ఎక్కువ. కాబట్టి, గత విజయాలను పక్కనపెట్టేయాలి.
* అందరూ కొత్త అమ్మాయి కదా అని ఆప్యాయంగా ఉంటారని ఆశించొద్దు. వాళ్లే వచ్చి పలకరిస్తారనీ అనుకోవద్దు. అసలే ఇప్పుడు దాదాపుగా సంస్థల కార్యకలాపాలన్నీ ఇంటి దగ్గర్నుంచే. కాబట్టి, అవసరమైతే తప్ప వాళ్లు మాట్లాడే అవకాశం తక్కువ. మీరే చొరవ తీసుకుని టీమ్ మొత్తాన్నీ పరిచయం చేసుకోవాలి. మార్గనిర్దేశం చేయమని అడగొచ్చు.
* కొందరు వాళ్లంతట వాళ్లే వచ్చి సాయమంది స్తారు. ఒక్కోసారి వాళ్లే మీ పనిని పూర్తిచేస్తుంటారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఏమీ చేయకుండా ఉండొద్దు. మీరు చేస్తుంటే గైడ్ చేయ మని వాళ్లని కోరొచ్చు. నేర్చుకోవడంతోపాటు పనిమీద మీ ఆసక్తిని ఎదుటివారికి తెలియజేసినట్లవుతుంది.