తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎల్​ఐసీ ఐపీవోకు మేం వ్యతిరేకం'

ఎల్​ఐసీని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆ సంస్థ ఉదోగులు, అధికారులు తెలిపారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు, ఎల్ఐసీ ఐపీఓకి వ్యతిరేకంగా హైదరాబాద్​లోని జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

Employees protest against LIC privatization in hyderabad
వేతన సవరణ అమలు చేయండి: ఏల్​ఐసీ ఉద్యోగులు

By

Published : Feb 8, 2021, 8:25 PM IST

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడం ద్వారా కొత్తగా మూలధనం వచ్చే అవకాశాలు తక్కువేని ఎల్ఐసీ ఉద్యోగులు తెలిపారు. ఎల్​ఐసీని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ.. హైదరాబాద్​లోని ఎల్ఐసీ జోనల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, అధికారులు కలిసి నిరసన వ్యక్తం చేశారు.

ఐపీఓ వల్ల ప్రైవీటీకరణ ప్రారంభమవుతుందని ఎల్ఐసీ ఉద్యోగులు తెలిపారు. ఆ కారణంగా బీమాదారులకు ఇచ్చే బోనస్​ తగ్గి పోతుందని.. ఆ కారణంగానే తాము కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details