తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్కరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఉద్యోగ జేఏసీ - minister srinivas goud latest news

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్​కు అందజేస్తున్నట్లు ప్రకటించారు. 33 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.

Breaking News

By

Published : Oct 21, 2020, 10:38 PM IST

సీఎం రిలీఫ్​ ఫండ్​కు విరాళలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్​కు అందజేస్తున్నట్లు ప్రకటించారు. 33 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్యోగ ఐకాస నాయకులు అన్నారు. ప్రభుత్వ సహాయానికి మద్దతుగా విరాళం ఇచ్చినట్లు చెప్పారు. ఒక్క రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:వరద బాధితుల కోసం పవన్..​ రూ.కోటి విరాళం

ABOUT THE AUTHOR

...view details