ఏలూరు వింత వ్యాధి ఘటనలో మరో ఇద్దరు మృతి - ఏలూరు వింత వ్యాధి వార్తలు
09:04 December 10
ఏలూరు వింత వ్యాధి ఘటనలో మరో ఇద్దరు మృతి
ఏపీలోని ఏలూరు వింతవ్యాధి ఘటనలో మృతులు సంఖ్య మూడుకు చేరింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బుధవారం రాత్రి సుబ్బరావమ్మ(56), చంద్రారావు(50) మరణించారు. సుబ్బరావమ్మ రెండ్రోజుల క్రితం మూర్ఛతో ఏలూరు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడ తరలించారు.
మృతురాలు సుబ్బరావమ్మ(56)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మృతుడు చంద్రారావు(50)కు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నెల 6న ఏలూరులో శ్రీధర్(45) అనే వ్యక్తి వింత వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతుచిక్కని వ్యాధి ఘటనలో మొత్తం బాధితల సంఖ్య 585కి చేరింది.
ఇదీ చదవండి: అదనపు రాయితీలు.. పక్కా ప్రోత్సాహకాలు