తెలంగాణ

telangana

ETV Bharat / state

Save Energy: దేశం అంధకారం కాబోతోందా? చైనా కరెంట్​కు మనకు సంబంధం ఏంటి? - హైదరాబాద్​ జిల్లా వార్తలు

విద్యుత్తు వినియోగం నగరంలో ఏటేటా 10 శాతం పెరుగుతోంది. కరెంట్‌ దుబారాను అరికట్టకపోతే కోతలు తప్పవనే హెచ్చరికలు చైనాలో ప్రస్తుత పరిస్థితులు మనకు గుర్తు చేస్తున్నాయి. భూతాపాన్ని అడ్డుకోవడానికి, కాలుష్య ఉద్గారాలను అదుపు చేసేందుకు పదుల సంఖ్యలో బొగ్గు సంస్థలు ఉత్పత్తి తగ్గించడంతో అక్కడ తీవ్ర విద్యుత్తు కొరత నెలకొంది. ఇక్కడా విద్యుత్తును దుబారా చేయకుండా పొదుపుగా వాడాల్సిన అవసరాన్ని విద్యుత్తు రంగ నిపుణులు సూచిస్తున్నారు.

power saving
power saving

By

Published : Oct 9, 2021, 10:05 AM IST

విద్యుత్తు వినియోగం నగరంలో ఏటేటా పెరుగుతుండడంతో కరెంట్‌ దుబారాను అరికట్టాలని విద్యుత్తు రంగ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కోతలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చైనాలోని ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నారు. భూతాపాన్ని అడ్డుకోవడానికి, కాలుష్య ఉద్గారాలను అదుపు చేసేందుకు పదుల సంఖ్యలో బొగ్గు సంస్థలు ఉత్పత్తి తగ్గించడంతో అక్కడ తీవ్ర విద్యుత్తు కొరత నెలకొందని తెలిపారు. మన దగ్గర కూడా విద్యుత్తును దుబారా చేయకుండా పొదుపుగా వాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

నిర్మాణాల దశ నుంచే..

నగర నిర్మాణాల్లో ఇదివరకు గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ ఉండేవి. కిటికీల్లోంచి ఎండ పడకుండా సజ్జలు ఉండేవి. ఇవి ఉష్ణాన్ని లోపలికి ఎక్కువ రానిచ్చేవికావు. ప్రస్తుతం నిర్మాణాలు చూస్తే ఇవేవి ఉండకపోగా.. గోడల స్థానంలో అద్దాలు ఉంటున్నాయి. దీంతో వేడి లోపల పెరుగుతోంది. భవనాల నిర్మాణదశలోనే విద్యుత్తు ఆదా చేసే చర్యలు చేపడితే చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పైకప్పు, గోడలు వేడి తగ్గే సామగ్రితో నిర్మించాలి. కిటికీలపైన షేడ్స్‌ ఉండాలి. ఇంటిపైన సౌరపలకలు బిగించుకోవాలి.

వినియోగం పరంగా...

  • ఇంట్లో మంచి స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఫ్రిజ్‌ వినియోగిస్తే విద్యుత్తు ఆదా చేయవచ్ఛు కూరగాయల వంటి వాటిని కవర్లలో ఉంచాలి. ప్రిజ్‌ ఉష్ణోగ్రతలను మధ్యస్థంగా సెట్‌ చేసుకోవాలి.
  • వాషింగ్‌ మిషన్‌ను సరిపడా లోడ్‌ అయ్యాకనే ఉపయోగించాలి. వేడి నీళ్లు కాకుండా సాధారణ నీటినే వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది.
  • గీజర్‌ గంటల పాటు పనిచేయకుండా కుటుంబ సభ్యులందరూ వెంటవెంటనే స్నానాలు ముగించడం మేలు. థెర్మోస్టాట్‌ 60నుంచి 50 డిగ్రీ సెంటీగ్రెడ్‌ ఉండేలా చూసుకోవాలి.
  • సాధారణ రోజుల్లోనూ ఏసీల వినియోగం క్రమంగా పెరుగుతోంది. గది ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటే ఉక్కపోత ఉండదు. ఏసీ గదిలో అనవసర వస్తువులు తీసేయాలి.
  • మెక్రోఓవెన్‌లో వండే పదార్థాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మధ్యలో తెరిచిచూస్తే.. మళ్లీ వేడెక్కేందుకు అధిక విద్యుత్తు వినియోగిస్తుంది.
  • ఇంట్లో నాణ్యమైన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు అయితే కరెంట్‌ వినియోగం తక్కువగా ఉంటుంది. పగలు సహజసిద్ధ వెలుతురులో ఉండేందుకు కిటికీలు, బాల్కనీ తలుపులు తెర్చి ఉంచుకోవడం మేలు.
  • రాత్రి అన్ని గదుల్లో దీపాలు వేయకుండా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే వేయాలి. కొత్త ఇళ్లలో సెన్సర్‌తో పనిచేసే లైట్లు బిగిస్తే కరెంట్‌ దుబారాను తగ్గిస్తుంది.

ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలి..

చైనాలో కొవిడ్‌ తర్వాత ఉత్పత్తి పెరగడంతో కరెంట్‌ వినియోగం 17 శాతం పెరిగిందని. బొగ్గు దిగుమతికి అడ్డంకులు, జల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడంతో గృహ సరఫరాకు కోతలు పెట్టారు. కరెంట్‌ లేకుండా ఆధునిక జీవన మనుగడ కష్టం. నిరంతర కరెంట్‌ ఉన్నా.. వృథాను అరికట్టాలి. ఇంట్లో వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకు దీన్ని పాటించాలి. నగరంలో చాలాచోట్ల పగటిపూట విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. బాధ్యత ఉండటం లేదు. -ఆళ్ల రామకృష్ణ, విద్యుత్తు రంగ నిపుణులు

2014-2020 వరకు వాడకం పరంగా వృద్ధి శాతాల్లో....

గృహవినియోగం 36.17

వాణిజ్యం 33.33

ఎల్‌టీ-పరిశ్రమలు 7.24

హెచ్‌టీ-పరిశ్రమలు 33.52

ఇతరత్రా 20.54

ఇదీ చదవండి:Rabi crops in Telangana : 'యాసంగిలో వరి సాగు వద్దు'

ABOUT THE AUTHOR

...view details