తెలంగాణ

telangana

ETV Bharat / state

సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన - అర్వింద్ సింగ్ పాల్ సంధు

సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు పరిశీలించారు.  ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరిస్తారు... ఎన్ని వస్తున్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

By

Published : Mar 28, 2019, 9:51 AM IST

సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన
ఎన్నిక‌ల ప్రవ‌ర్తన నియమావ‌ళి అతిక్రమ‌ణ‌ల‌పై ఆన్‌లైన్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను స్వీక‌రించి మానిట‌రింగ్ చేసే సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు పరిశీలించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల‌యం విజిలెన్స్ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని అర్వింద్ సింగ్ పాల్ సంధు, విన‌య్‌కుమార్‌ సంద‌ర్శించారు.

ఫిర్యాదుల‌ను ఏవిధంగా ప‌రిష్కరిస్తారు... ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని వస్తున్నాయి, ఎక్కువ‌గా ఏ అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయనే వివరాలను ఎన్నిక‌ల ప్రవ‌ర్తన నియ‌మావ‌ళి అమ‌లు నోడ‌ల్ అధికారి విశ్వజిత్ కంపాటిని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం సికింద్రాబాద్ హరిహ‌ర‌ క‌ళాభ‌వ‌న్‌లో దివ్యాంగుల‌కు ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్‌ ప‌నితీరుపై ఏర్పాటు చేసిన అవ‌గాహ‌న కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు.

ABOUT THE AUTHOR

...view details