హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని దివంగత నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌కు కేటాయించిన క్వార్టర్స్‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌బాగ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 129 క్వార్టర్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారమందగా.. గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పేకాట రాయుళ్ల అరెస్ట్ - eight arrested while playing cards at mla quarters hyderabad
హైదరాబాద్ బషీర్‌బాగ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మాజీమంత్రి ముఖేష్ గౌడ్‌కు కేటాయించిన క్వార్టర్స్‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. లక్షా 21 వేల నగదు, 8 చరవాణులు, ఖాళీ మద్యం బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పేకాట రాయుళ్ల అరెస్ట్
క్వార్ట్‌ర్స్‌లో పేకాట ఆడుతున్న కిరణ్‌కుమార్, సతీష్‌కుమార్, ప్రదీప్, మోహన్‌రావు, మురళి,మన్మోహన్, రాజ్‌కుమార్, గోపాల్రావులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గేమింగ్ యాక్టు కింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ. లక్షా 21 వేల నగదు, 8 చరవాణులు, ఖాళీ మద్యం బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.