ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ఓయూ ఉపకులపతి ఆచార్య రామచంద్రం, రాష్ట్ర ఎన్జీవోస్ అధ్యక్షులు కారం రవీందర్రెడ్డి ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. ఓయూ ఎన్జీవోస్, టెక్నికల్ స్టాఫ్ ,ఎంప్లాయిస్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మతసామరస్యానికి ఈద్ మిలాప్ ప్రతీక అని వీసీ రామచంద్రం అన్నారు. ఓయూ ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషిచేస్తున్నారని వీసీ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఉద్యోగులు,విద్యార్థుల సహకారంతో ఓయూకు ఉన్నతమైన ర్యాంకులు...పేరు ప్రతిష్ఠలు పొందామని వీసీ వివరించారు.ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని ప్రయోజనాలను యూనివర్సిటీ ఉద్యోగులకు వచ్చే విధంగా కృషి చేస్తానని రవీందర్ రెడ్డి చెప్పారు.
ఓయూలో ఈద్ మిలాప్ - tngos
ఓయూలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వీసీ రామచంద్రం,టీఎన్జీవోస్ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి హాజరయ్యారు.
ఓయూలో ఈద్ మిలాప్
ఇదీ చూడండినేడే కేబినేట్ సమావేశం