ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి తరగతులు నిర్వహించే పాఠశాలలు, కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని... మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను కొన్ని విద్యాసంస్థలు బేఖాతరు చేస్తున్నాయని... పలు ఫిర్యాదులు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చాయి. స్పందించిన కేటీఆర్ పరిస్థితిని విద్యాశాఖ మంత్రికి వివరించారు. కేటీఆర్ సూచనతో మంత్రి సబిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
'ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే యాక్షన్ తప్పదు' - sabitha indra reddy
ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పలువురు ఫిర్యాదులు చేయగా... చర్యలు తీసుకోవాలని మంత్రి సబితకు కేటీఆర్ సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించే విద్యాసంస్థలపై చర్యలు