రాష్ట్రంలో విద్యాసంస్థలు, గురుకులాలు, వసతిగృహాలు తెరవడంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చర్చించారు. తొమ్మిదో తరగతి ఆపై కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం: సబితా ఇంద్రా రెడ్డి
ఈనెల 25 వరకు పాఠశాలలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలు, గురుకులాలు, వసతిగృహాలు తెరవడంపై మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, అధికారులతో సమీక్షించారు.
విద్యాసంస్థల ప్రారంభంపై మంత్రుల సమీక్ష
ఈనెల 25 వరకు పాఠశాలలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరుశాతం తప్పనిసరికాదని... మధ్యాహ్న భోజనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుంటే విడతలవారీగా ఇతర తరగతులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే పాఠశాలలకు చేర్చామన్నారు. రేపటి సమావేశానికి తల్లిదండ్రుల కమిటీని ఆహ్వానించామని తెలిపారు.
Last Updated : Jan 18, 2021, 5:34 PM IST