'20వ తేదీలోగా పాఠశాలలకు, 25లోగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ' - text books latest news
19:20 July 09
'20వ తేదీలోగా పాఠశాలలకు, 25లోగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ'
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 25 లోగా పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని సుమారు 25 వేల సర్కారీ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే దాదాపు 24 వేల మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు పాఠ్య పుస్తకాలు సిద్ధం చేశారు. ప్రింటింగ్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు పుస్తకాలు తరలించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభమైందని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.
జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు... అక్కడి నుంచి పాఠశాలలకు చేర్చే ప్రక్రియను పర్యవేక్షించాలని డీఈవోలను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఈ నెల 20 లోగా పాఠశాలల్లో పుస్తకాలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 25లోగా పాఠశాలల నిర్వాహణ సంఘాల సమక్షంలో విద్యార్థులకు చేర్చాలని పేర్కొంది.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం