బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని ఎడ్‌సెట్ కమిటీ సభ్యులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 450 రూపాయలు.. బీసీ, ఓసీలు 650 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలన్నారు.
ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల... పరీక్ష ఎప్పుడంటే? - Edcet Exam Latest News
తెలంగాణలో ఎడ్‌సెట్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20న నోటిఫికేషన్... 24 నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ... మే 23న పరీక్ష, జూన్ 11న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎడ్‌సెట్ కమిటీ సభ్యులు తెలిపారు.

Council Of Higher Education
ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల... మే 23న పరీక్ష
రూ. 500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 25 వరకు, వెయ్యి రూపాయల రుసుముతో ఏప్రిల్ 30 వరకు, 2వేల రూపాయలతో మే 4 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని వెల్లడించారు. మే 23న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహిస్తామని... జూన్ 11న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
ఇవీ చూడండి :దేశాభివృద్ధికి నీటి సంరక్షణ ఎంతో ముఖ్యం: గవర్నర్