EC Orders To Return Seized Money Of Commoners :రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు(Telangana Election Police Checks) నిర్వహిస్తున్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయల నగదును, భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకుంటున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలను పట్టుకున్న.. వీటిలో సామాన్యులకు సంబంధించిన నగదు సైతం ఉండడం.. అవి తిరిగి ఇచ్చే క్రమంలో తీవ్ర జాప్యం జరగడంతో కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission)కు ఎక్కువగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై సీరియస్ అయింది.
EC Orders Telangana Police Over Seized Money : కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్‌కుమార్ .. రాష్ట్రంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న నగదులో ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదనుకుంటే సదరు యజమానులకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే వారికి నగదు తిరిగి ఇవ్వకపోవడంతో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లపై.. ఆయన సోమవారం రోజున దిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తనిఖీలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు.
Final Voter List Released in Telangana : 3,17,17,389 ఓటర్లతో తుది జాబితా రెడీ..
Election Commission on Returning Seized Money Telangana : త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పకడ్బందీగా ఉండాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఎక్కడా రాజీపడొద్దని రాష్ట్ర అధికారులకు మార్గనిర్దేశం చేశారు. నవంబరు 30వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య.. స్ట్రాంగ్ రూంలకు తరలించే ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.
Voters List in Telangana : ఇప్పటికే రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఈ ఎన్నికల షెడ్యూల్ విడులైన తర్వాత 10.6 లక్షల మంది ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వీటిలో 10 వేలు మినహా మిగిలిన అన్ని దరఖాస్తులను పరిశీలించినట్లు వివరించారు. ఓటర్ల జాబితా ముద్రణకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసి.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులకు ఉచితంగా ఓటరు జాబితాను ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 597 పోలింగ్ కేంద్రాలను పూర్తి మహిళలతో, 120 మంది దివ్యాంగులతో నిర్వహిస్తామన్నారు. పోలింగ్ రోజు దివ్యాంగ ఓటర్ల కోసం 18 వేల ప్రత్యేక వాహనాలను సమీకరిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Police Impose Election Code Strictly in Telangana : పోలీసుల విస్తృత సోదాలు.. భారీగా పట్టుబడుతున్న అక్రమ నగదు, బంగారు ఆభరణాలు
Vote from Home in Telangana Elections 2023 : వారందరికీ గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే ఓటు వేసుకునే ఛాన్స్..