పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టడం వల్ల.. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను ఏపీ జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. భారీ యంత్రాల సాయంతో వైబ్రో కాంప్యాక్షన్, శాండ్ ఫిల్లింగ్ పనుల్ని కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్ లిమిటెడ్ మొదలుపెట్టింది.
ఇసుక పటుత్వ పరీక్షలు
ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మించే ప్రదేశం వద్ద.. భారీ యంత్రాల సాయంతో 10 లక్షల 85 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. దాదాపు లక్షా 61 వేల మీటర్ల మేర శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కం రాక్ ఫిల్డ్యాం పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.