హైదరాబాద్ బేగంపేటలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఏర్పాటు చేసిన పాస్ పోర్టు మేళాను హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్టు అధికారి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా లేదా 2020 ప్రథమార్థంలో ఈ-పాస్ పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని విష్ణువర్ధన్ ప్రకటించారు. ఇందులో చిప్ ఉన్నందున... పాస్ పోర్టుల దుర్వినియోగం అరికట్టవచ్చు. వెరిఫికేషన్ కూడా వేగవంతం అవుతుందని తెలిపారు. పాస్ పోర్టు జారీ ప్రక్రియ సరళీకృతం చేశామని... గతేడాదితో పోలిస్తే.. ఈ ఆరునెలల్లోనే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని వివరించారు. ఫేక్ పాస్ పోర్టు ఇండియా వెబ్ సైట్ లపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఎన్ఆర్ఐ సంబంధిత పాస్ పోర్టు సమస్యలను మా పరిధి మేరకు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
2020 కల్లా ఈ-పాస్‌పోర్టు సేవలు - begumpet
పాస్‌పోర్టుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ-పాస్ పోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్టు అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
2020 కల్లా ఈ-పాస్‌పోర్టు సేవలు: విష్ణువర్ధన్ రెడ్డి