e-Challan Frauds in Hyderabad: ఎన్నడూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకున్నా.. ఎక్కడా గీత దాటకున్నా పోలీసులు చలానా విధించినట్లు ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. రూ.వేలల్లో కట్టాలని, లేకపోతే జైలుకెళ్తారంటూ హెచ్చరికలు వస్తుంటాయి. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటారు. ఇవి పోలీస్, రవాణా శాఖలు పంపించిన సందేశాలు కావు.. సైబర్ నేరగాళ్ల మాయ. ప్రజల డబ్బు దోచుకునేందుకు ఎప్పటికప్పుడు మారువేషాలు వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసుల అవతారమెత్తారు.
Fake e Challans in Hyderabad : ట్రాఫిక్ చలానాలు(e-Challan) చెల్లించాలంటూ బూటకపు సందేశాలతో మోతెక్కిస్తున్నారు. ఇవి నిజమేనని కొందరు తమకు వచ్చిన సందేశాల్లోని లింకులు క్లిక్ చేసి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.
Cyber frauds in Hyderabad : కామెంట్లు కావాలన్నారు.. కట్ చేస్తే.. రూ. 1.10కోట్లు కొట్టేశారు
Cyber Crime Cases in Hyderabad :నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాహన యజమాని నంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. సైబర్ నేరగాళ్లు దీన్నే సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-చలానా పేరుతో నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, డబ్బు కట్టేందుకు లింకు క్లిక్‌చేయాలని సూచిస్తారు. లింక్‌పై క్లిక్ చేస్తే మొబైల్లోని డేటా మొత్తం నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు మొబైల్ హ్యాక్ అవ్వడం, ఎనీ డెస్క్ తదితర యాప్‌లు డౌన్‌లోడ్ అవుతాయి. తర్వాత సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని సొమ్మంతా కొట్టేస్తారు. కొన్నిసార్లు మొబైల్లోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.