హాస్టల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై భోజనాలు చేసి తమ నిరసనను తెలిపారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండడం లేదని, మెస్‌లో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. ఎన్నిసార్లు రిజిస్ట్రార్ ఫ్రొపెసర్ గోపాల్‌రెడ్డికి తమ సమస్యలు విన్నవించుకున్నా పరిష్కరించడం లేదని... అందుకే తాము ఆందోళనకు దిగామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఓయూ విద్యార్థుల ఆందోళన... రోడ్డుపై బైఠాయించి నిరసన - సైన్స్ కాలేజ్ విద్యార్థులు
వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలంటూ ఓయూ విద్యార్థుల ధర్నా