హైదరాబాద్ సరూర్‌నగర్ మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్న సరస్వతి నగర్ కాలనీలో సుమారు ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అది సరస్వతి నగర్, వివేకానంద నగర్‌ని కలుపుతూ ఉందని... ఆ స్థలాన్ని కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు డంపింగ్ యార్డుగా చేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.
స్వచ్ఛతపై అధికారుల 'చెత్త' శుద్ధి... - dumping issue in hyderabad latest
భాగ్యనగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు డంపింగ్ యార్డుగా మారుస్తున్నారు. ఒక వైపు స్వచ్ఛత అంటూ కార్యక్రమాలు జరుగుతున్నా ఇవేవీ కొంత మంది అధికారులకు, ప్రజలకు పట్టడం లేదు. సరూర్‌నగర్ సమీపంలోని సరస్వతి నగర్ కాలనీలోని ఐదు ఎకరాల ఖాళీ స్థలం విషయంలోనూ ఇదే జరుగుతుందని చుట్టుపక్క ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వారు వచ్చి రోడ్డు శుభ్రం చేసి వెళ్తారని తెలిపారు. కానీ మళ్లీ రెండు రోజులకే చెత్త తయారవుతుందన్నారు. చనిపోయిన జంతువులను, ఇళ్లల్లోని చెత్తనూ ఈ స్థలంలోనే వేస్తున్నారని చెప్పారు. ఈ చెత్త వల్ల కాలనీల్లోని చాలా మందికి డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గంధం వల్ల శ్వాస పీల్చకోవడం కష్టంగా ఉందని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!