MLA Raghunandan rao : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. కేసీఆర్ భాషపై మేధావులు చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అటువంటి భాష వాడిన కేసీఆర్... ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం సరైందేనా ఆలోచించాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రశాంత్ కిశోర్‌ను తరుచుగా కలుస్తున్నారని... పీకే డైరక్షన్ మేరకే కేసీఆర్ ఆందోళనలు, భౌతికదాడులు చేస్తున్నారని ఆరోపించారు. వడ్లపైన శాస్త్రీయ డిబేట్‌కి కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారని రఘునందన్ రావు స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అవ్వడం లేదనే కేంద్రంపై కక్ష కట్టారని.... ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున తెరాసలో చేర్చుకున్నారని అన్నారు. డీలిమిటేషన్ జరిగితే మరికొంత మందికి కేసీఆర్ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారని... మౌనంగా ఉంటే భాజపా మింగేస్తోందనే భయంతో ఆందోళనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
MLA Raghunandan Rao : 'ఆయన డైరెక్షన్‌తోనే కేసీఆర్ ఆందోళనలు, దాడులకు పాల్పడుతున్నారు'
MLA Raghunandan Rao : ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా నాయకులు చేసిన తప్పేంటో ప్రజలకు విడమరచి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కేసీఆర్ వాడిన భాష.. సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
'హిందువుల గురించి భాజపా మాట్లాడితే మతతత్వం అంటున్నారు. కేసీఆర్... నిత్యం నిజాంను పొగుడుతున్నారు. ఇది మతతత్వం కాదా..? కాళేశ్వరం కట్టి పాలమూరుకు ఎన్ని టీఎంసీల నీళ్లు కొత్తగా ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. ముఖ్యమంత్రి ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ ఆరోపణలపై భాజపా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంది. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ నివేదికను పట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారు.' - రఘునందన్ రావు, భాజపా ఎమ్మెల్యే
ఇదీ చూడండి:Bandi sanjay: 'కేసీఆర్ రైతు పక్షపాతి కాదు.. రైస్‌మిల్లర్లకు సోపతి'