Next Two Days Dry Weather In Telangana: రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి తేలికపాటి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఈ రోజు తమిళనాడు తీరం పాండిచ్చేరి, కరైకాల్, దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్‌లలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది. గాలులు ఈశాన్య తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తాయని వెల్లడించింది. గత రెండు రోజులుగా ఉన్న చలి తీవ్రత కాస్త తగ్గిందని, నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.
'అప్పటి నుంచి చలి తీవ్రత మరింత అధికం' - Telangana Weather Report
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి తేలిక పాటి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది.
'అప్పటి నుంచి చలి తీవ్రత మరింత అధికం'